SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: ఏపీలో దారుణం.. లారీతో తొక్కించి ఇద్దరి హత్య.. రూ.200 కోసం!


శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంత్రకోట కూడలి వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. లారీ ఢీకొన్న ఘటనలో అయూబ్, దండసి ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంత్రకోట కూడలి వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మద్యం సేవించిన లారీ డ్రైవర్ ఒకరు దాబా యజమానిని, పాలు సరఫరా చేసే వ్యక్తిని తన వాహనంతో ఢీకొని చంపినట్లు సమాచారం. సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన లారీ డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ జలంత్రకోటలోని న్యూ స్టార్ దాబాలో భోజనానికి ఆగాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న ఇబ్రార్, పక్కనే ఉన్న సోంపేట మండలం సంధికొట్టూరుకు చెందిన యువకుడితో ఘర్షణకు దిగాడు. దాబా యజమాని మహమ్మద్ అయూబ్ (55) జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశాడు. దాంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


భోజనం ముగించుకుని డ్రైవర్ లారీతో బయలుదేరుతుండగా.. అయూబ్ అతన్ని ఆపి, చెల్లించాల్సిన రూ. 200 బిల్లు ఇవ్వమని అడిగాడు. అయితే.. డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ తన లారీతో అయూబ్‌ను ఢీకొట్టాడు. దాబాకు పాలు సరఫరా చేసే మడుపురం గ్రామానికి చెందిన దొక్కర దండసి (66) కూడా డ్రైవర్‌ను ఆపడానికి ప్రయత్నించగా.. లారీ అతడిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అయూబ్, దండసి ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్తుండటంతో.. స్థానికులు తమ వాహనాలలో అతన్ని వెంబడించి రెండు కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నారు. డ్రైవర్ ఇబ్రార్ ఖాన్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts