అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు..
షేక్ అంజాద్‌కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే..
భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం పోలీసులకు అప్పప్పించారు. చేసిన ఆంజాద్‌ను పట్టుకుని
సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!