హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన వెయ్యి రూపాయల అప్పును తిరిగి ఇవ్వకపోవడంతో బాలాజీ అనే యువకుడు బహిరంగంగా అవమానం చెందాడు. ఆ అవమానం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అవసరం అంటే అప్పు ఇచ్చాడు. రెండేళ్లైనా తిరిగి ఇవ్వడం లేదు. గట్టిగా అడిగిన పాపానికి అప్పు ఇచ్చిన వ్యక్తినే ఓ మహిళ అందరి ముందు నడి రోడ్డుపై చెప్పుతో కొట్టింది. అంతే ఆ అవమాన భారంతో ఆ యువకుడు ఊహించని పనిచేశాడు. తన కుటుంబానికి అన్యాయం చేస్తూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో చోటు చేసుకుంది.
మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా రాఘవాపూర్‌కు చెందిన భూక్య బాలాజీ (28) తన భార్య మానసతో కలిసి జవహర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. అతని స్వస్థలానికి చెందిన సైదులు, దుర్గ అనే దంపతులు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం బాలాజీ దుర్గకు వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు. సెప్టెంబర్ 17న అతను ఆ జంటను మార్కెట్లో కలిసి డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో ఆగ్రహించిన దుర్గా తమను బజార్ల డబ్బులు అడుగుతావా అంటూ బాలాజీపై దాడి చేసి అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టింది.
తీవ్ర అవమానానికి గురైన బాలాజీ ఇంటికి వెళ్లి గురువారం తన భార్య ఇంట్లో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానస తిరిగి వచ్చేసరికి తలుపు తాళం వేసి ఉంది. కిటికీలోంచి చూడగా బాలాజీ లోపల ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు. వెంటనే చుట్టుపక్కట వాళ్లకు, పోలీసులకు సమాచారం అందించగా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!