కాకినాడ జిల్లాలో ఇద్దరి హత్య మరో రుణదాతపై హత్యాయత్నం విఫలం
గొల్లప్రోలు, : తాను ఇవ్వాల్సిన బాకీ డబ్బుల
గురించి మాట్లాడాలని నమ్మకంగా రప్పించి, ఇద్దరిని బావిలోకి తోసి హత్య చేసిన ఉదంతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చోటుచేసుకుంది. గ్రామ శివారు పంట పొలాల్లోని బావిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతులను అదే గ్రామానికి చెందిన రంపం శ్రీను (51), తోరాటి సూరిబాబు (44)గా నిర్ధారించారు. స్థానికుడైన రంపం గంగాధర్ ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ ఇద్దరినీ బావిలోకి తోసి హత్య చేయడంతో పాటు కుంపట్ల సూరిబాబును సుద్దగెడ్డ వాగులోకి నెట్టి చంపేందుకు యత్నించినట్లు పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీను, సూరిబాబులకు ఇవ్వాల్సిన బాకీ నగదు గురించి మాట్లాడేందుకు రావాలని గంగాధర్ పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి అక్కడి బావిలో తోసి హతమార్చాడు. ఆ తరువాత కుంపట్ల సూరిబాబుకు బాకీ సొమ్ము ఇస్తానని రాత్రి సుమారు 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి సుద్దగెడ్డ వాగులోకి నెట్టి చంపడానికి ప్రయత్నించాడు. సూరిబాబు తప్పించుకుని పారిపోయాడు. గంగాధర్పై పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు