SGSTV NEWS online
Andhra PradeshCrime

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. 5
రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు



రూ.3,500 కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. ధనుంజయరెడ్డి (ఏ-31), కృష్ణమోహన్రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33), పైలా దిలీప్ (ఏ-30)లు బెయిల్పై బయటకు రాగా.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్నాయుడు సహా మొత్తం 8 మంది ఇంకా జైల్లోనే ఉన్న  విషయం తెలిసినదే

Also read

Related posts