డబ్బుల కోసం ఎంతటి దారుణానికైన రెడీ అవుతున్నారు. తప్పుడు పనికి ఏకంగా మరుభూమిని పడగపాన్పుగా మార్చుకుంటున్నారంటే సమాజం ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీగా ఉందని శ్మశానవాటికలోని రూమ్‌ను మహిళ ఎంచక్కా వ్యాపార కేంద్రంగా మార్చింది.
Crime News: డబ్బుకు లోకం దాసోహం అన్నారు. డబ్బుల కోసం ఎంతటి దారుణానికైన రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది తప్పుడు పనికి ఏకంగా మరుభూమిని పడగపాన్పుగా మార్చుకుంటున్నారంటే సమాజం ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు శ్మశానవాటికలు కబ్జాలు చేసిన వారిని, గుట్టుగా ఆ ప్రాంతంలో మందు కొట్టే వారినే మాత్రమే చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. తప్పుడు దారిలో నడుస్తున్న ఓ మహిళ ఏకంగా మరుభూమినే వ్యభిచారానికి అడ్డంగా మార్చేసింది. ఖాళీగా ఉందని శ్మశానవాటికలోని రూమ్‌ను ఎంచక్కా వ్యాపార కేంద్రంగా మార్చింది. స్మశానంలో వ్యభిచారం చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తోంది.
అది కూడా ఎక్కడో కాదు హైదరాబాద్‌లోని నడిబొడ్డున ఉన్న బిజీ సెంటర్ అయిన బేగంపేటలోని శ్మశానవాటిక కేంద్రంగా చేసుకుంది మారీ మాధవి అనే మహిళ. ధనియాలగుట్ట శ్మశానవాటికలోని రూమ్‌ను వ్యభిచార గృహంగా మార్చి బిజినెస్ పెట్టేసింది. అయితే సాధారణంగా ఎవరైనా చనిపోతే మాత్రమే జనసంచారం ఉండే స్మశానంలో ఎప్పుడూ లేని విధంగా ఆ ప్రాంతంలో వ్యక్తుల సంచారం ఎక్కువ అవ్వడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. అక్కడో ఏదో జరుగుతుందన్న అనుమానంతో వారిలో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కొన్ని రోజులు అక్కడ నిఘా పెట్టారు. చివరకు సడెన్‌గా రైడ్ చేశారు
పక్కా సమచారంతో ధనియాగుట్ట శ్మశానవాటికలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో మాధవి వ్యాపారం గుట్టు వీడింది. ఆమెతోపాటు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు వారిని విచారించిన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను రప్పించి మాధవి బిజినెస్ చేసేదని గుర్తించారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడ పని కానిచ్చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు పోలీసులకు చిక్కిన వ్యక్తుల్లో ఓ సివిల్ కాంట్రాక్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అరెస్టు చేసిన వారి నుంచి కొంత నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు