అనకాపల్లి జిల్లా కు చెందిన ఓ యువకుడు తమిళనాడుకు వెళ్లి.. అక్కడ నుంచి శవమై తిరిగి వచ్చాడు.. అక్కడ భవనం పైనుంచి పడి ప్రణాలు కోల్పోయాడు. చెన్నై కోయంబేడు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో కలకలం రేపింది.
అనకాపల్లి జిల్లా కు చెందిన ఓ యువకుడు తమిళనాడుకు వెళ్లి.. అక్కడ నుంచి శవమై తిరిగి వచ్చాడు.. అక్కడ భవనం పైనుంచి పడి ప్రణాలు కోల్పోయాడు. చెన్నై కోయంబేడు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అనకాపల్లిలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు నవీన్.. బుధవారం సాయంత్రం కోయంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.. గురువారం ఉదయం కుటుంబ సభ్యులకు అక్కడి పోలీసుల సమాచారం అందించారు. అయితే.. నవీన్ ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. యువతి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తుంది బాధిత కుటుంబం.. దీనిపై విచారణ జరపాలని కోరుతున్నారు.
రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో నవీన్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతుంది బాధిత కుటుంబం.. చెన్నై పోలీసుల అదుపులో అనుమానితులున్నారు. తీవ్ర విషాదంలోకీ వెళ్లింది నవీన్ కుటుంబం. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
‘‘8న స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్తున్నానని చెప్పాడు.. గురువారం నాడు మాకు చని పోయినట్టు సమాచారం అందింది. నవీన్ ప్రయాణించిన రైలు టికెట్ లో రూప, ఆమె తల్లి కూడా ప్రయాణం చేశారని తెలిసింది. అనకాపల్లి – విజయవాడ.. అక్కడి నుంచి రైల్లో అరుణాచలం వెళ్లారు. అందరూ ఓకే చోట ఉన్నారు. నవీన్ మొబైల్ ధ్వంసం అయింది. ఘటనపై అనుమాన్నాలున్నాయి. పథకం ప్రకారం తీసుకెళ్లి హత్య చేసారు. ఏదైనా విషయం ఉంటే మాతో మాట్లాడితే సరిపోతుంది చెప్పే వాళ్ళం. ఈ పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు.. మాకు న్యాయం జరగాలి.’’ అని మృతుడి పెదనాన్న వెంకట్రావు అన్నారు.
హత్య ఆనవాళ్లు ఉంటే.. ఆత్మహత్య అని అంటున్నారు. ఆత్మహత్యకు కారణమేంటో తెలియాలి. హత్య అయితే నిందితులు తేలాలి.. మాకు న్యాయం జరగాలి.. అంటూ నవీన్ మేనమామ వాసు కంటతడి పెట్టారు
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





