SGSTV NEWS
CrimeTelangana

కరీంనగర్ దీపిక ఆసుపత్రిలో టైపాయిడ్ జ్వరంతో ఉన్న పెషెంట్ పై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్ట్….

*

నగరంలో దీపిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈనెల 6న అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన సదరు యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో హాస్పిటల్లోనే పనిచేస్తున్న దక్షిణామూర్తి (23) అనే యువకుడు ఆమెకు తెలియకుండా  ముత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు., సిపి మాట్లాడుతూ మహారాష్ట్ర సిరోంచ కు చెందిన దక్షిణామూర్తి ఆసుపత్రి OT లో టెక్నీషియన్ గా పని చేస్తున్నడనీ, అత్యాచారం చేసే ముందు సీసీ కెమెరాలో రికార్డ్ కాకుండా వాటిపై పరదా వేశాడని, మద్యం సేవించి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, అతని మొబైల్ ఫోన్ లో కూడా అశ్లీల చిత్రాలు కూడా లభ్యమయ్యాయనీ తెలిపారు.

Also read

Related posts

Share this