బాధ్రపద మాసం పౌర్ణమి తిథి (సెప్టెంబర్ 7) నుంచి ప్రారంభమైన పితృ పక్షానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. బాధ్రపద మాసం అమావాస్య రోజున పూర్తి అవుతుంది. ఈ 15 రోజుల వ్యవధిని పూర్వీకులకు అంకితం చేయబడినదిగా భావిస్తారు. కనుక ఈ సమయంలో అనేక నియమాలను పాటిస్తారు. ఈ రోజు పితృ పక్షంలో జుట్టు, గోర్లు కత్తిరించడం నిషేధం. ఎందుకో తెలుసుకుందాం.
పితృ పక్షం అంటే మన పూర్వీకులను స్మరించుకుని వారికి సరైన రీతిలో నివాళులు అర్పించే సమయం. పితృ పక్షం ప్రతి సంవత్సరం 15 రోజులు ఉంటుంది. దీనిని శ్రాద్ధ పక్షం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం తర్పణం, శ్రాద్ధ కర్మలు, పిండప్రదానం మొదలైనవి చేస్తారు. పితృ పక్ష సమయంలో మన పూర్వీకులు 15 రోజులు భూమికి వచ్చి వారి వారసులను ఆశీర్వదిస్తారని చెబుతారు. శ్రాద్ధ పక్షం కోసం హిందూ గ్రంథాలలో అనేక నియమాలు ప్రస్తావించబడ్డాయి. ఈ కాలంలో జుట్టు , గోళ్లను కత్తిరించకూడదనేది ఈ నియమాలలో ఒకటి. దీని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకుందాం.
పితృపక్ష నియమాలు పితృ పక్ష సమయంలో వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం, జుట్టు కత్తిరింపు వంటి శుభకరమైన లేదా మంగళకరమైన పనులు చేయరు. అలాగే ఈ కాలంలో కొత్త వస్తువులను కొనడం, ఉపయోగించడం నిషేధించబడింది. దీనితో పాటు పితృ పక్ష సమయంలో గడ్డం, మీసం, జుట్టు కత్తిరించడం కూడా నిషేధించబడింది. శ్రాద్ధ కర్మ సమయంలో గడ్డం, మీసం, జుట్టు కత్తిరించకూడదనే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం పితృ పక్ష సమయంలో జుట్టు, గోళ్లను కత్తిరించరు. మరికొందరు శాస్త్రీయ కారణాల వల్ల ఈ సమయంలో జుట్టు, గోళ్లను కత్తిరించరు.
పితృ పక్షంలో జుట్టు, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదంటే సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం పితృదేవతల పట్ల గౌరవం చూపించడానికి, తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటున్నాం అనే విషయాని తెలియజేసేందుకు పితృ పక్ష సమయంలో గోర్లు కత్తిరించకూడదనే సంప్రదాయాన్ని అవలంబిస్తారు. శ్రద్ధా పక్ష సమయంలో ఆధ్యాత్మికంగా స్వచ్ఛమైన , సాత్విక జీవితాన్ని గడుపుతారు. ఈ కాలంలో జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించడం పూర్వీకులను అగౌరవపరచడమేనని, వారి ఆత్మల శాంతికి భంగం కలిగిస్తుందని చెబుతారు.
శోకం, భక్తికి చిహ్నం: పితృ పక్షం అనేది పూర్వీకులను స్మరించుకోవడం, వారికి గౌరవం ఇవ్వడం. ఈ సమయంలో శారీరక మార్పులకు దూరంగా ఉండటం ద్వారా మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం ముఖ్యం.
పూర్వీకులను అవమానించడం: ఈ కాలంలో గోర్లు కత్తిరించడం పూర్వీకులను అగౌరవపరచడమేనని నమ్ముతారు. ఇది పితృ దేవతలకు ఒక రకమైన అపవిత్ర కార్యక్రమంగా పరిగణించబడుతుంది.
సాత్విక్త కాలం: ఈ కాలం సాత్విక్తాన్ని అనుసరించే సమయం. ఈ సమయంలో బాహ్య రూపానికి లేదా మార్పులపై శ్రద్ధ చూపించరు.
పితృ పక్ష సమయంలో గోర్లు కత్తిరించకూడదనుకుంటే… పితృ పక్ష ప్రారంభానికి ఒక రోజు ముందు పౌర్ణమి రోజున నుంచి ఈ పనులను చేయడం విరమించుకుంటారు. పితృ పక్షం ముగిసిన తర్వాత మాత్రమే గోర్లు, జుట్టు కత్తిరిస్తారు. అలాగే ఈ సమయంలో క్షౌరం కూడా చేయించుకోరు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు