నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకోవడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మణిహారిక ఏసీబీ వలలో పడింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





