SGSTV NEWS online
Andhra PradeshCrime

Crime News : నంద్యాలలో భార్య గొంతు కోసి చంపిన భర్త


నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శిరీష అనే మహిళను ఆమె భర్త సాయినాథ శర్మ గొంతుకోసి చంపేశాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్యపై అనుమానమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కత్తితో భార్య కడుపులో, మెడపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు

నంద్యాల(nadyala) ఎన్జీవో కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శిరీష అనే మహిళను ఆమె భర్త సాయినాథ శర్మ గొంతుకోసి చంపేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు, భార్యపై అనుమానమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎన్జీఓ కాలనీలో సాయినాథశర్మ, శిరీష దంపతుల నివాసం ఉంటున్నారు.


ఆర్థిక ఇబ్బందులు(Financial Issues), కుటుంబ కలహాలతో నిత్యం గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సాయినాథ శర్మ నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కత్తితో భార్య కడుపులో, మెడపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది

Also read

Related posts