SGSTV NEWS
CrimeTelangana

దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి..!

పవిత్ర పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం పరిసరాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ప్రధాన గుడి వెనుక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇది భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి..


జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ క్షుద్ర పూజలు ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి గుడి వెనక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. గుడి ముందు ప్రధాన రహదారిపై నల్లకోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన సామాగ్రిని రహదారి పైన వదిలి వెళ్లారు.. ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పుణ్య క్షేత్రంలో ఎవరు క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Also read

Related posts

Share this