SGSTV NEWS
Andhra PradeshCrime

Vizag: నిద్రిస్తున్న భర్తపై సలసల మరిగే వేడినీళ్లు పోసిన భార్య



వారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయినా కొంతకాలానికే విబేధాలు తలెత్తాయి. కొన్నాళ్లు విడిగా ఉన్నారు. మూడేళ్లుగా వేరుగా ఉన్న దంపతులు కలిసిన కొద్ది రోజులకే భయానక మలుపు తీసుకుంది. భర్తతో వాగ్వాదం అనంతరం, రాత్రి నిద్రిస్తున్న అతనిపై భార్య వేడి నీళ్లు పోసిన ఘటన విశాఖ జిల్లా భీమిలి సమీపంలో వెలుగులోకి వచ్చింది.

విశాఖలో భర్తతో విసిగి వేసారిన ఓ భార్య.. ఊహించని పని చేసింది. భర్త నిద్రమత్తులో ఉండగా అతనిపై వేడి నీళ్లు పోసేసింది. తీవ్ర గాయాలతో ఆ భర్త ఆసుపత్రి పాలయ్యాడు. భీమిలి నేరెళ్లవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గౌతమి, కృష్ణ దగ్గర బంధువులు. ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడున్నర ఏళ్ల పాప కూడా ఉంది. అయితే మనస్పర్థలతో గత మూడేళ్లుగా.. విడివిడిగా ఉంటున్నారు. భర్తపై గౌతమి గతంలో వేధింపుల కేసు కూడా పెట్టింది. పంచాయితీ పెద్దల వరకు కూడా వెళ్ళింది. దాదాపుగా మూడేళ్ల తర్వాత.. ఇద్దరూ సర్దుకుని మళ్ళీ కలిశారు. మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఇటీవల ఇద్దరు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈ సమయంలో.. భార్య గౌతమిపై దాడి చేశాడు భర్త కృష్ణ. రాత్రి అవడంతో భర్త బయట అరుగుపై నిద్రించాడు. దీంతో అప్పటికే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న గౌతమి.. వేడి నీళ్లు తీసుకొచ్చి కృష్ణపై పోసింది. వెంటనే లేచిన కృష్ణ.. కాస్త ఇబ్బందిపడినా.. ఆ తర్వాత డ్రెస్ మార్చుకొని పడుకున్నాడు. ఈలోగా ఆ వేడికి శరీరమంతా మంట మొదలైంది. స్థానికుల సాయంతో ఆసుపత్రికి వెళ్ళాడు కృష్ణ. అక్కడ నుంచి హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో కృష్ణకు చికిత్స అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also read

Related posts

Share this