భార్య, ఆమె బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు
నంద్యాలలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భార్య, ఆమె తరుపు బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని నంద్యాలకు తీసుకెళ్లారు.
రమణ, రమణమ్మ నూనెపల్లె ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. రమణ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నినెలలుగా భార్యభర్తల మధ్య తరుచూ విభేదాలు వస్తున్నాయి. రమణతో గొడవ పడి, రమణమ్మ 2 నెలల క్రితం పిడుగురాళ్ల పుట్టింటికి వెళ్లింది. రమణమ్మ కోసం మంగళవారం రమణ మద్య సేవించి పిడుగురాళ్ల వచ్చాడు. మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడు. బంధువులు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణ మృతదేహాన్ని రాత్రి రాత్రే నంద్యాలలోని అతని ఇంటికి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేసి రమణ బంధువులు త్రీ టౌన్ పి.ఎస్.లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. రమణ మృతదేహాన్ని పోస్టుమార్థం కోసం నంద్యాల జి.జి.ఎచ్.కు తరలించారు.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





