గండికోటలో మైనర్ బాలిక తనను చంపొద్దని తమ అన్నయ్యలను వేడుకున్నట్లు తెలుస్తోంది. తాను ఏం పాపం చేశాను అన్నా అంటూ ప్రాదేయపడినట్లు సమాచారం. ఆ యువతి ఎంత చెప్పినా వినకుండా కడుపులో తన్ని, చేతులను వెనక్కి విరిచి హత్య చేసినట్లు తెలుస్తోంది.
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి అన్నలే తమ చెల్లెలను హత మార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా హత్య జరిగిన ప్రాంతంలోనే మృతురాలి అన్నలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాలిక సొంత అన్నయ్య బ్రహ్మయ్య, పెదనాన్న కొడుకు కొండయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ హత్యకు సంబంధించి పలు విషయలు బయటకొచ్చి సంచలనంగా మారాయి. ఆ మైనర్ బాలిక తనను చంపొద్దని తమ అన్నయ్యలను వేడుకున్నట్లు తెలుస్తోంది. తాను ఏం పాపం చేశాను అన్నా అంటూ ఆ బాలిక ఎంతో ఏడ్చినట్లు సమాచారం. కాళ్లు మొక్కుతూ ఎంతో ప్రాదేయపడినట్లు తెలుస్తోంది. కానీ వారు కొంచెం కూడా కనికరించలేదు. ఆ యువతి ఎంత చెప్పినా.. వారు వినకుండా పిడుగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలోనే ఆ యువతి లివర్ చెడిపోయినట్లు సమాచారం. లోపలున్న లివర్ తీవ్రంగా గాయపడి.. నల్లగా కమిలిపోయినట్లు తెలుస్తోంది. కన్నుమొత్తం రంగు మారిపోయినట్లు సమాచారం. తమ పరువు తీస్తున్నావంటూ కోపంతో కడుపులో తన్ని, చేతులను వెనక్కి విరిచి చిత్ర హింసలకు గురి చేసి ఆపై ఆమెను హత మార్చినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా సొంత చెల్లెల్ని వివస్త్రను చేశారు. శరీరంపై బట్టలు లేకుండా నగ్నంగా డెడ్ బాడీని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటనతో కడప జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు