SGSTV NEWS
Andhra Pradesh

MP Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్



ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 6గంటలకుపైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఇఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు.


ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెెస్ట్ చేసింది. ఇవాళ సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. 6 గంటలకు పైగా అధికారులు ఆయన్ని విచారించారు. ఈ విచారణ తర్వాత సిట్ ఎంపీని అరెస్ట్ చేసింది. ఆయన్ని రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కుటుంబసభ్యులకు సిట్ సమాచారం ఇచ్చింది. మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. ఆ వివరాలను ఇవాళ్టి విచారణలో ఆయన ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు.


మరోవైపు ఈ కేసులో ఇవాళ తొలి ఛార్జ్‌షీట్‌ను సిట్ కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలను బయటపెట్టింది. అయితే మిథున్ రెడ్డి పేరును మాత్రం సిట్ ప్రస్తావించలేదు. ఏసీబీ న్యాయాధికారికి 300 పేజీల ఛార్జ్ షీట్‌ను సిట్ సమర్పించింది.  100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు దానికి జత చేసింది. మొత్తం రూ. 62 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో 268మంది సాక్ష్యులను విచారించినట్లు సిట్ వివరించింది.  11 మంది నిందితుల స్టేట్‌మెంట్ల నివేదికలను ఛార్జ్‌షీట్‌లో మెన్షన్ చేసింది. బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులు, బ్లాక్ మనీని వైట్‌గా మార్చడం వంటి అంశాలను ఛార్జ్‌షిట్‌లో సిట్ వివరించింది.  రియల్ ఎస్టేట్ సంస్థలు, కంపెనీలు, బంగారం షాపుల్లో పెట్టుబడులకు సంబంధించిన స్టేట్‌మెంట్ల రికార్డులను ఛార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొంది.

Also read

Related posts

Share this