SGSTV NEWS online
CrimeTelangana

గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం



గద్వాల పట్టణం, : గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య ప్రియుడి మోజులో పడి సుపారీ గ్యాంగ్తో భర్తను అంతమొందించి తనకేమీ తెలియనట్లు వ్యవహరించిందని కుటుంబ సభ్యులు వాపోయారు. జూన్ 17న తేజేశ్వర్ కనిపించకపోవడంతో తోబుట్టువులందరూ కలత చెంది, కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే ఆమె ముఖంలో ఏమాత్రం బాధ కనిపించలేదన్నారు. ఇటీవల ఐశ్వర్య గదిలో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గ్లిజరిన్ సీసాను గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా కన్నీళ్లు వచ్చేలా కంట్లో వేసుకుని నటించిందని అనుమానిస్తున్నారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీనిపై గద్వాల సీఐ శ్రీను మాట్లాడుతూ గ్లిజరిన్ సీసాను స్వాధీనం చేసుకుని కుటుంబీకుల ఆరోపణల కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Also read

Related posts