SGSTV NEWS
SpiritualVastu Tips

Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..




వాస్తు శాస్త్రం ఇంటిలో ప్రతి దిక్కుకి ఒక ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా ఇంటి దక్షిణ దిశ సంపదతో ముడిపడి ఉంటుందని చెబుతారు. ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుందని, ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. కనుక ఈ రోజు దక్షిణ దిశలో పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.


ఇంటి నిర్మాణం, దిశ, ఆకారం, వంటగది సహా ఇంటిలోని ప్రతి మూలకు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం అని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా నియమాలను పాటించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ఏర్పడి ఈ కారణంగా సంపదను పెంచుతుంది . వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుందని చెబుతారు. కనుక ఈ రోజు దక్షిణ దిశలో పెట్టాల్సిన వస్తువులు ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..


ఫీనిక్స్ పక్షి చిత్రం : ఇంటి దక్షిణ గోడపై ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని లేదా పెయింటింగ్‌ను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో ఈ పక్షి చిత్రాన్ని ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద వస్తుంది . అలాగే ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు .

చీపురు : చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంది . అటువంటి పరిస్థితిలో చీపురును తప్పుడు దిశలో ఉంచడం వల్ల మీరు పేదరికానికి దారితీయవచ్చు. వాస్తు నిపుణులు చెప్పిన ప్రకారం.. చీపురును ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వలన ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. సంపదను పెంచుతుంది. అయితే ఎప్పుడూ చీపురును బయటి వ్యక్తులు చూడలేని విధంగా ఉంచాలనే విషయం మాత్రం మరచిపోవద్దు.


మంచం : సాధారణంగా ప్రతి ఇంట్లో మంచం ఉంటుంది. కానీ తెలిసి లేదా తెలియకుండా మంచాన్ని తప్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే.. ఆ మంచం వాస్తు దోషాలకు కారణమవుతుంది . వాస్తు శాస్త్రం ప్రకారం మంచం తల ఎల్లప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి. ఇది జీవితంలో సానుకూల శక్తిని కలిగిస్తుంది.

పూర్వీకుల ఫోటో : ఇంటి దక్షిణ దిశ కూడా యముడు, పూర్వీకులతో ముడిపడి ఉంది. కనుక ఇంటిలోని ఈ ప్రదేశంలో పూర్వీకుల ఫోటోను పెట్టుకోవడం శుభప్రదం. ఇది పూర్వీకుల ఆత్మకు శాంతిని ఇస్తుంది. పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులపై ఉంటాయి .

జాడే మొక్క : జాడే మొక్కను సంపద మొక్క అని పిలుస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను దక్షిణ దిశలో ఉంచితే డబ్బు అయస్కాంతంలా ఆకర్షించబడి ఆర్థిక లాభాలు లభిస్తాయని చెబుతారు

Also read

Related posts

Share this