కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అప్పుల వివాదం చిలికి చిలికి గాలివానైంది. అప్పుల చెల్లింపు విషయమై భార్యాభర్తలైన విద్యా, విజయ్ మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త విజయ్, భార్య విద్యా ముక్కును కొరికేశాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పులు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ చివరకు తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆ కోపంలో భర్త తన భార్య ముక్కును కొరికివేశాడు. ఈ ఘటన ఇవాళ (శుక్రవారం) వెలుగులోకి వచ్చింది.
కోపంలో భార్య ముక్కు కొరికేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవణగిరి జిల్లా, చన్నగిరి తాలూకా, మంతరఘట్ట గ్రామానికి చెందిన విద్యా (30), ఆమె భర్త విజయ్ మధ్య గత కొన్ని రోజులుగా అప్పుల చెల్లింపు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. విద్యా తీసుకున్న రుణానికి విజయ్ హామీగా ఉన్నాడు. అయితే విద్యా వాయిదాలు చెల్లించడంలో విఫలం కావడంతో అప్పు ఇచ్చిన వారు భార్యాభర్తలను వేధించడం మొదలెట్టారు
ఈ నేపథ్యంలో మంగళవారం (జూలై 8) మధ్యాహ్నం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం పెరిగి గొడవకు దారితీయగా, విద్యా కింద పడిపోయింది. ఆవేశంలో ఉన్న విజయ్, విద్యా ముక్కును కొరికేశాడు. దీంతో ఆమె ముక్కు చివర భాగం తెగిపోయింది.
బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, విద్యాని శివమొగ్గలోని మెగ్గన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై విద్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా, శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసును దేవణగిరి జిల్లాలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విజయ్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్‌లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





