ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. విద్యా శాఖలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో పడేసి వెళ్లారు.
TG Crime: ఈ మధ్య హత్యలు జరుగుతున్న తీరు చూస్తుంటే గుండెలో గుబులు పుడుతోంది. అంతుచిక్కని రీతిలో హత్యలు చేస్తున్నారు నేరస్థులు. తాజాగా ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్లి, మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది
మర్మాంగాలు కోసి..
అయితే రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా, ఈరోజు ఉదయం రాజశేఖర్ మృతదేహం మర్రిపూడి బస్టాండ్ ప్రాంతంలో కనిపించడం కలకలం సృష్టించింది. గుర్తుతెలియని దుండగులు అతడి మర్మాంగాలను కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు మరణానికి ముందు రాజశేఖర్ ని ఒక వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు దారుణ హత్యకు గురవడంతో అతడి తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025