ఇల్లు అద్దె కోసం వచ్చేవారి పై ఓ కన్నేసి పెట్టాలి.. అద్దెకు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.. వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటో ప్రాథమికంగా తెలుసుకోవాలి.. అవేవీ చెక్ చేసుకోకుండా.. డబ్బులు వస్తాయి కదా అని ఇల్లు అద్దెకి ఇస్తే అంతే సంగతులు.. మీ అదృష్టం బాగుంటే పర్లేదు.. లేకపోతే ఎవరో చేసిన పనికి మీరు బాధ్యులు అవుతారన్నది పోలీసుల మాట..! ఇంతకీ ఏం జరిగిందనేగా మీ ఆలోచన.. ఇక్కడ అవేం పట్టించుకోకుండా ఇల్లు అద్దెకు ఇస్తే.. చివరకు దిమ్మతిరిగే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది.
అనకాపల్లి పట్టణం సిరస పల్లెలో ఉంటున్న ఒక ఇంటికి కొంతమంది యువకులు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. అద్దె చెప్పగానే.. అంతకుమించి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముందు వెనుక ఆలోచించకుండా ఇంటిని అద్దె కిచ్చేసారు ఇంటి ఓనర్. ఆ ఇంట్లో అద్దెకు దిగారు ఆ యువకులు. దాన్ని ఓ గోడౌన్ గా వాడుకున్నారు. ఇందులో పోలీసులకు ఓ కీలక సమాచారం అందింది. ఆ ఇంటిపై మెరుపు దాడులు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా..? గంజాయి స్మగ్లింగ్. తీసుకున్న అద్దె ఇంటిని గంజాయి డెన్గా మార్చేసుకున్నారు ఆ యువకులు. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి ఆ ఇంట్లో స్టోర్ చేసి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులకు సమాచారం అందడంతో అడ్డంగా బుక్కయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పెదబయలు మండలానికి చెందిన వంతల రమేశ్, వరుణ్ తేజ, శామ్యూల్.. స్నేహితులు. 20 రోజుల క్రితం సిరసపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అందులో 44 కిలోల గంజాయి నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గంజాయితోపాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. అద్దెకిచ్చిన యజమానికి కూడా పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి వారికి అద్దెకిస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని హెచ్చరించారు.
Also read
- Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
- అయ్యో అయాన్.. చిన్నారిని అంగన్వాడీకి పంపిస్తే నిర్లక్ష్యంతో చంపేశారు..
- Telangana: ఆడితే దండిగా డబ్బులు వస్తాయంటారు.. కట్ చేస్తే.. చివరికి చచ్చేది మనమే
- అడవి పందిని వేటాడేందుకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఆపై కాసేపటికే
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్





