మైసూరు: పర పురుషునితో పరారైన తన భార్యను చంపిన ఘటన చామరాజనగరలోని సోమవారపేటె బడావణెలో జరిగింది. విద్య (26) అనే మహిళను ఆమె భర్త గిరీష్ హత్య చేసి పరారయ్యాడు. వివరాలు.. కరినంజనపుర బడావణెకు చెందిన విద్యకు సోమవారపేటకు చెందిన గిరీష్తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.
కొన్ని రోజుల క్రితం విద్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది. తరువాత వాపసు వచ్చిన ఆమెను పుట్టింటివారు, భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు. దీంతో ఆమె మహిళా సాంత్వన కేంద్రంలో ఆశ్రయం పొందింది. ఇటీవల తన మొబైల్ను భర్త నుంచి తీసుకుంది. భర్త గిరీష్ సాంత్వన కేంద్రానికి వెళ్లి మొబైల్ వాపసు ఇవ్వాలని గొడవ పడ్డాడు.
ఫిర్యాదు చేసి వెళ్తుండగా దాడి
దీంతో విద్యా తన భర్త గిరీష్ తనను వేధిస్తున్నాడంటూ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళా సాంత్వన కేంద్రానికి వెళుతుండగా ఆమెను అడ్డుకున్న గిరీష్ పదునైన కొడవలితో దాడికి యత్నించాడు. ఆమె చేయిని అడ్డు పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది. ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఓ కెఫె ముందు పడిపోయింది.
భర్త ఆమె మెడ, భుజనం, తలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది. ఆ సమయంలో కెఫెలోని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నంచగా వారిపై గిరీష్ తిరగబడ్డాడు. కొడవలిని అక్కడే పారేసి రైల్వేస్టేషన్ కు వెళ్లే రోడ్డు వైపు పరుగెత్తి తప్పించుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యా మృతదేహాన్ని అంబులెన్స్లో నగర శివార్లలోని సిమ్స్ బోధనాస్పత్రికి తరలించారు. ఎస్పీ డాక్టర్ బీటీ కవిత, ఏఎస్పీ శశిధర్, డీఎస్పీ లక్ష్మయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Also read
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు
- రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..





