ప్రధానంగా యువత హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి వేళల్లో ఇష్టారీతిన సంచరిస్తున్న దాఖలాలు ఎన్నో కనబడుతున్నాయి. ఫుల్లుగా మద్యం తాగి సరదాలంటూ రోడ్డు మీద పడిపోయి ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. దీనిపట్ల తల్లితండ్రులు కూడా బాధ్యత వహించాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
అతివేగం ప్రమాదాలకు కారణమని ఎన్నిసార్లు ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నా, పరిస్థితిలో మార్పు కనపడడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ఇదివరకే గతంలో అతివేగం, నిర్లక్ష్యం కారణంగా పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు చూశాం. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ నగరం చంచల్‌గూడ ప్రధాన రహదారిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో నాలుగు ద్విచక్ర వాహనాలను ఓ కారు ఢీకొంది. ఈ దారుణ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే.. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న నలుగురు యువకులు భయంతో కారును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, ప్రమాదానికి కారణమైన ఆ నలుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రధానంగా యువత హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి వేళల్లో ఇష్టారీతిన సంచరిస్తున్న దాఖలాలు ఎన్నో కనబడుతున్నాయి. ఫుల్లుగా మద్యం తాగి సరదాలంటూ రోడ్డు మీద పడిపోయి ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. దీనిపట్ల తల్లితండ్రులు కూడా బాధ్యత వహించాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైనర్ యువకులకు వాహనాలు ఇవ్వడం సరికాదని, ఆ విషయంలో తల్లిదండ్రులే జాగ్రత్త పడాలని, లేదంటే ఇలాంటి అనర్థాలకు తావు ఇచ్చినట్లు అవుతుందని కోరుతున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!