SGSTV NEWS online
Andhra PradeshPolitical

Somireddy: జూన్ 4.. ప్రజాస్వామ్యం బతికిన రోజు: సోమిరెడ్డి

గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి  విమర్శించారు.

నెల్లూరు: గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) విమర్శించారు. నెల్లూరులోని రైల్వే కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. సంబంధం లేని కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరైనట్లు తెలిపారు.

రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడని ఆరోపించారు. కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని రూ. వేల కోట్లు సంపాదించి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.



“వెన్నుపోటు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ కు లేదు. కానిస్టేబుల్ను చంపబోయిన రౌడీషీటర్ను ఆయన పరామర్శించారు. జూన్ 4న రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చింది.. ప్రజాస్వామ్యం బతికిన రోజు” అని సోమిరెడ్డి -. పేర్కొన్నారు

Also read

Related posts