మనుషుల్లో రాక్షస పవృత్తి పెరుగుతోంది. తాజాగా ఏడుపదులు దాటిన ఓ వృద్ధుడు ఏడేండ్ల వయసున్న చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడటం కలకలం రేపింది. చావుదలకు నీచపు పనికి దిగిన వృద్ధున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగిందీ ఘటన.
7 Year Old Girl Raped: మనుషుల్లో రాక్షస పవృత్తి పెరుగుతోంది. సాంకేతికత పెరిగిన కొద్దీ మనుషులు వావివరుసలు, వయసు తారతమ్యాలు మరిచిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏడుపదులు దాటిన ఓ వృద్ధుడు ఏడేండ్ల వయసున్న చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడటం కలకలం రేపింది. చావుదలకు నీచపు పనికి దిగిన వృద్ధున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా లాకప్‌లో ఉన్న వృద్ధునిపై చిన్నారి మేనమామ బ్లేడుతో దాడిచేయడంతో వృద్ధుడు గాయపడ్డాడు. దీంతో ఆయన పై హత్యాయత్నం కేసు నమోదైంది. వివరాల ఇలా ఉన్నాయి.
తిరుపతికి చెందిన దంపతులు ఆరునెలల క్రితం తమ ఏడేండ్ల కూతురుతో కలిసి బతుకుతెరువు కోసం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు వలస వచ్చారు. స్థానిక సంతమార్కెట్‌లోని పడాలవీధిలో అద్దెకు ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ చిన మీరావలి (70) మాంసం విక్రయిస్తూ జీవిస్తున్నాడు. కాగా ఇటీవల ఇంటిముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మీరావలిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ప్రభుత్వాసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. కాగా ఈ విషయం ఆనోట, ఈ నోట అందరికీ తెలియడంతో బాలిక బంధువులు, వివిధపార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాదనకు దిగారు. కొందరు సీఐ జగదీశ్వరరావు, ఎస్ఐ నాగరాజుతో ఘర్షణ పడ్డారు.
ఈ ఘర్షణ ఇలా కొనసాగుతుండగానే బాలిక మేనమామ స్టేషన్ లోపలికి వెళ్లి లాకప్‌లో ఉన్న మీరావలిపై దాడి చేసి బ్లేడ్‌తో గాయపర్చాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే తేరుకున్న పోలీసులు మీరావలిని, బాలిక మేనమామను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించారు. డీఎస్పీ జయసూర్య ఆకివీడు ఆసుపత్రిలో మీరావలి పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాణాపాయం లేదని వైద్యు లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో బాలిక మేనమామ చికిత్స పొందుతున్నాడు. డీఎస్పీ జయసూర్య పర్యవేక్షణ లో ఎస్ఐ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మేనమామపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





