హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలకలం చెలరేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మృతి చెందగా, 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
TG CRIME: హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి(Erragadda Mental Hospital)లో కలకలం చెలరేగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మృతి చెందగా, 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన మానసిక రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వచ్చిన వైద్యాధికారులు ఫుడ్ పాయిజన్‌పై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తాగునీరు అపరిశుభ్రంగా ఉండటమే కారణమని కొంతమంది అంటుండగా, ఆహారం పాయిజన్ కావడంవల్లే ఇలా జరిగిందని మరికొందరు ఆరోపిస్తున్నారు
ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోయారు. 70 మందిలో 68 మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘటనపై ఆరా తీశారు. ఉస్మానియానికి వచ్చిన వైద్య బృందం 68 మంది రోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు
బుధవారం కూడా పలువురు రోగులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలుషితాహార ఘటనపై ఎర్రగడ్డ ఆసుపత్రిలో డీఎంఈ, డీఎంహెచ్‌వో, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. తాగునీరు కలుషితమైందా? లేక ఫుడ్ పాయిజన్ కారణం అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షలకు పంపారు. హైదరాబాద్ కలెక్టర్ అనురాగ్ దుర్సెట్టి ఆసుపత్రిని సందర్శించారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!