భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆరు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావమై మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. ఆమె సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య, గర్భిణి చేత ఆమె భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆమె తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది. ఏఎస్‌ఐ మారుతి వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ప్రవళిక(23)కు అదే గ్రామానికి చెందిన సేపుర్‌వార్ ప్రశాంత్‌తో మూడేళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రవళిక ఆరు నెలల గర్భవతిగా ఉంది. అయితే శుక్రవారం రాత్రి ప్రవళిక భర్త ప్రశాంత్ గుర్తు తెలియని మాత్రలను తీసుకువచ్చి ఆమె చేత బలవంతంగా మింగించాడు. దీంతో అప్పటి నుంచి ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది.
వెంటనే ట్రీట్ మెంట్ కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. గర్భస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్ వైద్యుల సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక శనివారం రాత్రి మృతి చెందారు. ఆమె సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కొత్తగా ఇంటి పనులు చేపట్టడం, అదే సమయంలో భార్య గర్భవతిగా ఉండకూడదన్న మూఢనమ్మకంతో భర్త ప్రశాంత్ గర్భస్రావ మాత్రలు ఇచ్చాడా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
Also read
- Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!
- లేడీస్ హాస్టల్లో అపస్మారక స్థితిలో యువతి.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..
- వైజాగ్ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో సరికొత్త ట్విస్ట్.. పోలీసుల తీరుపై తండ్రి సంచలన ఆరోపణలు!
- రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్: కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
- దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? ప్రసాదం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





