ఛతీస్గడ్ నుంచి ములుగు జిల్లాకు హైదరాబాద్ మీదుగా ఓ కంటైనర్ లారీ వెళ్తోంది. పైకి చూసి అవన్నీ టమాటో లోడ్ అని అందరూ అనుకున్నారు. తీరా లోపల చెక్ చేసి చూడగా.. దెబ్బకు పోలీసులే షాక్ అయ్యారు. ఇంతకీ అదేంటో ఆ వివరాలు..
పుష్ప సినిమాలోని కొన్ని స్మగ్లింగ్ సీన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. కానీ ఈ స్మగ్లింగ్ సీన్ అంతకు మించి ఎవరూ ఊహించనిది. పోలీసులే షాక్ అయ్యేలా పశువులను అక్రమ రవాణా చేస్తున్న పాపాత్ములు అడ్డంగా బుక్కయ్యారు..కంటైనర్ పైన మొత్తం టమాటా ట్రేలు.. లోపల మూగజీవులను బంధించి కబేళాలకు తరలిస్తున్న ఆ వ్యాపారులు అడ్డంగా బుక్కయ్యారు. ఛతీస్గడ్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి పశువులను ములుగు జిల్లా మీదుగా హైదరాబాద్ కబేళాలకు తరలిస్తున్న వ్యాపారులు పాపం పండింది. ఈ ఏడాది ఇప్పటివరకు 256 మూగజీవులకు ములుగు జిల్లా పోలీసులు విముక్తి కల్పించారు.
ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. అయితే గంజాయి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక చెక్‌పోస్ట్‌లలో అక్రమంగా తరలిస్తున్న మూగజీవులే ఎక్కువగా పట్టుబడుతున్నాయి. వాటిని అత్యంత దారుణంగా వాహనాల్లో బంధిస్తున్న వ్యాపారులు వాటి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా TS 05UF 2690 గల వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠా అడ్డంగా బుక్కయ్యారు.
పశువుల అక్రమ రవాణా కోసం కంటైనర్‌ను ప్రత్యేకంగా మాడిఫైడ్ చేసుకున్న వ్యాపారులు.. పైన అన్నీ టమాటా ట్రేలు పెట్టారు. లోపల మూగజీవులను బంధించి కబేళాలకు తరలిస్తున్నారు. మార్గం మధ్యలో పోలీసులు చెక్ చేసిన ప్రతీచోటా టమాటా ట్రేలు తీసుకెళ్తున్నామని నమ్మిస్తూ వచ్చారు. కానీ ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి చెక్‌పోస్ట్ వద్ద అనుమానం వచ్చిన పోలీసులు వాహనం మొత్తం తనిఖీ చేయడంతో అసలు గుట్టు రట్టయింది. పైన టమాటా ట్రేలు లోపల మూగజీవులను చూసి షాక్ అయ్యారు. వాహనం లోపల 17 గుర్తించారు. వాటికి విముక్తి కల్పించి గోశాలకు తరలించారు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Also read
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్‌గా సెలైన్‌తో పనికానిచ్చేసింది
- గుర్రంపై స్వారీ.. ‘దేశ గురువు’గా ఎంట్రీ.. గ్రామస్థుల అనుమానాలతో పరార్..!
- అమావాస్య ఎంత పనిచేసింది.. తెల్లారి ముగ్గు చూసి పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. ఇదిగో వీడియో
- మహిళా లెక్చరర్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. సీన్‌కట్‌చేస్తే.. కాంట్రాక్టర్ కుమారుడికి ఊహించని షాక్..





