తిరుపతి జిల్లా గూడూరు అశోక్‌నగర్ సమీపంలో మురికి కాలువలో రెండు పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ దృశ్యం చూసిన షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
AP Crime: తిరుపతి జిల్లాలోని గూడూరు అశోక్‌నగర్ సమీపంలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మురికి కాలువలో రెండు పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా ఈ దృశ్యం చూసిన షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన శిశువులు కవలలుగా గుర్తించారు. అయితే ఎవరు, ఎందుకు, ఎప్పుడు ఈ అమాయకుల ప్రాణాలను తీశారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది
కాలువలో కవలల మృతదేహాలు:
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. శిశువుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. శిశువుల వయస్సు కనీసం రెండు నుంచి మూడు రోజుల మధ్య ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఎవరు వారిని అలా వదిలిపెట్టారన్నది అనుమానాస్పదంగా ఉంది. పుట్టిన కొన్ని రోజుల్లోనే వారి జీవితాలను అంతం చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనవత్వం మరిచి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పసికందులను కాలువల్లో పడేయడం మానవత్వాన్ని తలపోసే విధంగా ఉంది. కుటుంబంలో, సమాజంలో అర్థం కాని ఒత్తిళ్లు, వివాహేతర సంబంధాలు లేదా పుట్టిన వెంటనే పిల్లలను అంగీకరించని పరిస్థితులు ఇటువంటి దారుణాలకు దారి తీయవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. శిశువుల మృతదేహాలు కాలువలోకి కొట్టుకు వచ్చాయా ? లేక ఎవరైనా తెచ్చి పడేశారా అన్న కోణంలో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించే క్రమంలో శిశువుల మృతదేహాలు బయటపడినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ విషాదకర ఘటన వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకునేందుకు పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమీపంలోని ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాల్లో ఇటీవల పుట్టిన శిశువుల వివరాలు సేకరిస్తున్నారు.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





