UP బీజేపీ నేత అమర్‌కిషోర్, మహిళా కార్యకర్తతో పార్టీ ఆఫీస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో కూడా 2 రోజుల క్రితం మరో BJP లీడర్ వీడియో లీకైన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత మహిళతో నడిరోడ్డుపై శృంగారం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. తాజాగా మరో బీజేపీ లీడర్ రాసలీలల వీడియో లీక్ అయ్యింది. మహిళా కార్యకర్తను రాత్రి పార్టీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లే ముందు ఆ మహిళను అతను కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 12న రాత్రి 9.30 గంటలకు గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్, ఒక మహిళా కార్యకర్తని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చాడు. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. దీంతో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వీడియోపై బీజేపీ నేత బామ్ బామ్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైందని చెప్పారు. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని చెప్పానని అన్నారు. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేసినట్లు బామ్ బామ్ తెలిపారు. అయితే తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం ఇష్టం లేని కొందరు ఇలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. ఈ వీడియో వైరల్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు