కౌమార దశలో పిల్లల ఎమోషన్స్‌ను అంచనా వేయడం కష్టం. బయటకు మాములుగానే కనిపిస్తున్నా వారి మనసులో వంద ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయ్.. చిన్న విషయాలకే కోపం వస్తుంది. కొన్నిసార్లు ఆవేశంలో విపరీత నిర్ణయాలు కూడా తీసుకుంటారు. తాజాగా ఏపీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోని ఓ ఇంటర్ విద్యార్థి… రోజువారి కూలి పనులకు వెళ్లే తండ్రి సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నాగభూషణం… కుటుంబంతో సహా గుంతకల్ వచ్చి రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడైన నాగభూషణం కొడుకు శ్రీనివాస్.. తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని… రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుంతకల్ పట్టణ శివారులోని రైల్వే ట్రాక్‌పై ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడైన శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే గుంతకల్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదివేందుకు జాయిన్ అయ్యాడు. అయితే స్నేహితుడి పాత మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకుని శ్రీనివాస్ కొంతకాలంగా వాడుకుంటున్నాడు. కాలేజీకి వెళ్తున్నాను… కొత్త సెల్ ఫోన్ కావాలని శ్రీనివాస్… తన తండ్రి నాగభూషణంను అడిగాడు. అయితే కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని సాకుతున్న తండ్రి నాగభూషణం… కాస్త డబ్బు సమకూరాక కొనిస్తానని చెప్పాడు. అదే విధంగా శ్రీనివాస్ దగ్గర ఉన్న పాత మొబైల్ ఫోన్లో ఉన్న సిమ్ తీసుకొని తండ్రి నాగభూషణం తన మొబైల్ ఫోన్లో వేసుకున్నాడు. ఆ పాత ఫోన్ స్నేహితుడికి ఇచ్చేయమని చెప్పాడు. కొత్త సెల్ ఫోన్ కొనివ్వకపోగా… తన సిమ్ కార్డు తండ్రి తీసుకోవడంతో మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్… రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
చేతికొచ్చిన కొడుకు ఇలా… సెల్ ఫోన్ కొనివ్వలేదన్న చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. డబ్బులు వచ్చాక సెల్ ఫోన్ కొనిస్తానని చెప్పిన శ్రీనివాస్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదు అంటున్నాడు తండ్రి నాగభూషణం. ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్ వాడుతున్న పాత మొబైల్ ఫోన్… అతని సిమ్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వేరే ఏదైనా కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదువుకొని తమ కూలి బతుకులకు అండగా ఉంటాడనుకున్న కొడుకు అకారణంగా ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025