గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో బాలుడు మృతి చెందాడు. వెయింటింగ్ హాల్లోని గోడపక్కనే తల్లి బాలుడిని నిద్రపుచ్చుతుండగా ఈ ఘోరం జరిగింది. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు
AP News: స్కూల్ లో పెచ్చులూడిపడి, పైకప్పు కూలి చనిపోయిన సంఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే గుంతకల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో బాలుడి ప్రాణం పోయింది. ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది.
పెచ్చులూడి
కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం కలిసి రామేశ్వరం వెళ్లడానికి తెల్లవారుజామున గుంతకల్లు రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు.
ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉండడంతో 7వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ వద్ద వెయింటింగ్ హాల్లోని గోడపక్కన వెంకటేశ్వర్లు భార్య కొడుకును నిద్రపుచ్చుతుంది. ఈ క్రమంలో గోడ పెచ్చులూడి బాబు తలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి పేరు మణికంఠ 14 ఏళ్ళు అని తెలిసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025