తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్‌లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
TG RajBhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్‌లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. సీసీ రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓ గదిలో ఈ చోరీ జరిగగా.. దుండగులు హెల్మెట్‌తో కంప్యూటర్ రూమ్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఈ పని ఎవరు చేశారనేది ఉత్కంఠగా మారింది. తెలిసిన వారే చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఈ హార్డ్‌డిస్క్‌ల్లో రాజ్‌భవన్‌లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ డేటా మాయం మాయమైతే ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





