అరటి గెలలు తీసుకెళ్తున్న లారీలోని వ్యక్తులు కంగారుగా కనిపించడంతో.. పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నిలిపి వేసి అరటి గెలలతో నిండుగా ఉన్న లోడ్ చెక్ చేశారు. అంతే వాళ్లకంగారుకు కారణం తెలిసిపోయింది. రెండు మూడు అరటి ఆకులను పక్కకు తొలగించి చూడగా.. పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లోపల పెద్ద సెటప్‌నే ఏర్పాట్లు..
చౌటుప్పల్, మే 19: అరటి గెలల లోడ్ నిండుగా ఉన్న లారీ ఒకటి రోడ్డుపై వెళ్తుంది. మొత్తం లోడ్ అంతా అరటి ఆకులతో ఫుల్‌గా కప్పేశారు. అయితే వాహనం నడుపుతున్న లారీ డ్రైవర్, అతడి పక్కనున్న మరో వ్యక్తి మాత్రం అనుమానాస్పదంగా కనిపించారు. ఇక రోడ్డుపై టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చెకింగ్‌కు ఆపగా ఒకటే కంగారు. అరటి గెలలు తీసుకెళ్తున్న లారీలోని వ్యక్తులు కంగారుగా కనిపించడంతో.. పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నిలిపి వేసి అరటి గెలలతో నిండుగా ఉన్న లోడ్ చెక్ చేశారు. అంతే వాళ్లకంగారుకు కారణం తెలిసిపోయింది. రెండు మూడు అరటి ఆకులను పక్కకు తొలగించి చూడగా.. పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లోపల పెద్ద సెటప్‌నే ఏర్పాట్లు చేయడంతో.. వెంటనే సదరు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వాహనం సీజ్ చేశారు. ఇంతకీ వాహనంలో ఏం ఉందంటే..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద రాచకొండ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై అరటి గెలలతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆపుజేశారు. అయితే పోలీసులు వాహనంలోని అరటి గెలలను తొలగించి చూడగా లోపల దాదాపు 28 వరకు గోవులు ఇరుకైన స్థలంలో చీకటి గదిలో బిక్కుబిక్కుమంటూ కనిపించాయి. అసలేం జరిగిందంటే..

ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురం సంతలో నిందితులు 28 గోవులను కొనుగోలు చేశారు. వీటిని హైదరాబాద్‌లోని బహుదూర్‌పురా కబేళాకు డీసీఎం వాహనంలో తరలించేందుకు డీసీఎం వాహనాన్ని తీసుకున్నారు. దారిలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మన పుష్ప మాదిరి డీసీఎం వాహనంలో గోవులను ఎక్కించి.. పై వరుసలో చెక్కలను అమర్చి వాటిపై అరటి గెలలను వేశారు. ఆపై అరటి ఆకులతో వాటిని కప్పివేశారు. ఈ విషయం బజరంగ్‌దళ్, గోరక్ష దళ్ కార్యకర్తలకు తెలియడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాపుకాసిన పోలీసులు ఈ వాహనాన్ని పంతంగి టోల్‌ప్లాజా వద్ద పట్టుకొని గోవులను జియాగూడ గోశాలకు తరలించారు. వాహరంలోని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెంకు చెందిన డ్రైవర్ రమావత్ శరత్‌కుమార్, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్లీనర్ దాసరి భగవాన్‌గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025