SGSTV NEWS
Andhra PradeshCrime

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!


అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎలకపల్లె గ్రామ సమీపంలోని రోడ్డుపై గుర్తు తెలియని మహిళని హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిప్పు పెట్టి కాల్చిన్నారు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

AP Crime: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో జరిగిన మహిళ దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎలకపల్లె గ్రామ సమీపంలోని రోడ్డుపై గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరకడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. మృతురాలిని హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిప్పు పెట్టి కాల్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మంటలు గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మదనపల్లి డీఎస్పీ మహేంద్ర సంఘటన స్థాలనికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తించటం కష్టంగా మారింది. బాధితురాలిని గుర్తించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

హత్యకు చేసింది ఎవరు..?
ఈ దారుణ ఘటన వెనుక ఉన్నది ఎవరు అనేది ప్రస్తుతం స్పష్టత లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారం కోసం ఈ దారుణం ఎవరైనా చేశారని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన తీరు, మృతదేహాన్ని పూర్తిగా కాల్చిన విధానం చూస్తే.. ఇది కావాలని చేసిన నేరమంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు.  నిందితుడు ఒకరా లేక పలువురా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు మృతురాలు ఈ ప్రాంతానికి చెందినవారా..? లేదా ఇతర చోట్ల నుండి తీసుకొచ్చారా అన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన స్థలంలో ఉన్న ఆధారాలు సేకరించి, ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి మరిన్ని వివరాలు వెలికితీయాలని అధికారులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం కేసును రామసముద్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫోన్ కాల్ రికార్డులు తదితర ఆధారాలను ఉపయోగించి నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురైతున్నారు.

Also read

Related posts