అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బావ, బావమర్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో బావ తన ఇద్దరు బావమర్దులను శూలంతో పొడిచి చంపాడు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..
దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో చోటు చేసుకుంది. కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025