AP : విడదల రజినీ ఉగ్రరూపం. మాస్ మహారాణి పూనకం. నడి రోడ్డు మీద రెచ్చిపోయారు మాజీ మంత్రి. పోలీసులపై విరుచుకుపడ్డారు. తన అనుచరుడు శ్రీకాంత్ను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. సీఐని నెట్టి వేశారు. పోలీసులతో గొడవ పడ్డారు. నడిరోడ్డు మీద నానా రచ్చ చేశారు.
మాజీ మంత్రి అయితేనేం? పోలీసులు ఊరుకుంటారా? ఖాకీలు సైతం అదే రేంజ్లో రెచ్చిపోయారు. రజినీతో గొడవకు దిగారు. బలవంతంగా ఆమె కారులోకి ప్రవేశించారు. అప్పటి వరకూ కారులో నక్కిన శ్రీకాంతన్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వర్సెస్ విడదల రజినీ ఎపిసోడ్తో పల్నాడు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది.
అసలేం జరిగిందంటే..
నాదెండ్ల మండలం మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు మాజీ మంత్రి విడదల రజినీ. ఆమెతో పాటు కారులో ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఆ విషయం తెలిసి ఓ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంతన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, అందుకు విడదల రజినీ ఒప్పుకోలేదు. కారులో ఉన్న శ్రీకాంతన్ను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మాగ్జిమమ్ ట్రై చేశారు. ఈ క్రమంలో కారు డోరును నెడుతూ.. సీఐ మీదకు దూసుకొచ్చారు రజినీ. ఆ క్రమంలో సీఐ సుబ్బారాయుడిని దూరంగా తోసేశారు మాజీ మంత్రి. ఏ కేసులో శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుంటారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సీఐ వర్సెస్ రజినీ
పోలీసులు సైతం ఎక్కడా తగ్గలేదు. తమ విధులకు అడ్డు రావొద్దంటూ రజినీకి సూచించారు. అయినా ఆమె వినకపోతే ఖాకీలు దూకుడు పెంచారు. విడదల రజినీని పక్కకు జరిపేసి.. కారు డోర్ తీసుకుని.. వేగంగా లోపలికి దూసుకెళ్లారు సీఐ సుబ్బారాయుడు. అసలు ఏం జరుగుతోందో అర్థం అయ్యేలోగానే.. సీఐ స్పీడ్గా తన పని ముగించేశారు. శ్రీకాంత్ను బలవంతంగా కారులోంచి బయటకు దింపేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో పోలీసులు, విడదల రజినీ మధ్య తీవ్ర గలాటా జరిగింది. మహిళా నాయకురాలిపై ఖాకీలు దురుసుగా ప్రవర్తించారంటూ వైసీపీ వర్గాలు ఆ వీడియోను షేర్ చేస్తున్నాయి. పోలీసులపై విడదల రజినీ దౌర్జన్యం చేశారంటూ టీడీపీ శ్రేణులు సైతం అదే వీడియోను వైరల్ చేస్తున్నాయి.
చిక్కుల్లో మాజీ మంత్రి..
అధికారం కోల్పోయాక విడదల రజినీని కేసులు చుట్టుముడుతున్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులకు బెదిరించి రూ. 2 కోట్లు డబ్బులు వసూలు చేశారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో A1 గా ఉన్న రజినీ ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. A3 గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. A4గా రజినీ పీఏ రామకృష్ణ ఉన్నారు. క్రషర్ కేసులో మాజీ మంత్రి విడదల రజినీ నేడో రేపో అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తన అనుచరుడు శ్రీకాంత్ కోసం పోలీసులతో రజినీ గొడవ పడటం, ఆ వీడియో కాస్త వైరల్ అవుతుండటంతో.. ఆమెపై మరో కేసు కన్ఫామ్ అంటున్నారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు