శ్రీనగర్ సమీపంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ దాడులు చేయడంతో ఈ సంఘటన జరిగింది. భారత సైన్యం పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడి చేసింది. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ దాడులకు భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది.
శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలోని గగనతలంలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. నిన్నటి వరకు డిఫెన్స్ సిస్టమ్ ఎస్400 గురించి మాట్లాడుకున్నాం.. కానీ, ఇప్పుడు ఈ రెండు జెట్స్‌ను కూల్చింది ఆకాశ్ అనే మరో డిఫెన్స్ సిస్టమ్. పాకిస్తాన్ రాత్రిపూట భారత భూభాగంలోకి డ్రోన్లతో కాల్పులు జరపడంతో జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ విధించిన నేపథ్యంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిలో ఎక్కువ భాగాన్ని గాల్లోనే అడ్డుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ పదే పదే షెల్లింగ్, ఫిరంగి కాల్పులకు పాల్పడుతోంది. దీనికి భారత దళాలు అంతే తీవ్రతతో ప్రతిస్పందిస్తున్నాయి. పాకిస్తాన్ జరిపిన దాడిలో శ్రీనగర్‌లో ఎటువంటి నష్టం జరగలేదని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ వైమానిక దాడిని భారత్ మరోసారి విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే కూలిన ఆ రెండు జెట్స్ శిథిలాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్
పాకిస్తాన్ నుండి ఎల్ఓసి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పౌరుల ప్రాంతాలపై డ్రోన్లను ప్రయోగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరువాత శ్రీనగర్ ప్రాంతంలో సాయుధ దళాలు ఉపరితలం నుండి గగనతలంలోకి క్షిపణి వ్యవస్థలను యాక్టివ్ చేశాయి. భారత సైన్యం పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. శనివారం ఇండియాలోని 26 ప్రదేశాలపై పాకిస్తాన్ చేసిన దాడికి తక్షణ ప్రతీకారంగా ఈ భారత సైన్యం దాడి చేపట్టింది. ఇంతలో జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లోని దిబ్బర్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన తరువాత పొగలు ఎగసిపడుతున్నాయి. వరుస పేలుళ్ల కారణంగా రాజౌరి ప్రాంతంలో అనేక ఇళ్ళు, ఆస్తులు దెబ్బతిన్నాయి.
పహల్గామ్ నుంచి..
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాకిస్తాన్‌ను భారత ప్రభుత్వం కార్నర్ చేసింది. అలాగే మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది భారత్. ప్రతీకారంగా పాకిస్తాన్ గత రెండు రోజులుగా సైనిక, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అనేక భారతీయ నగరాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించి యుద్ధానికి కాలుదువ్వుతోంది.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





