ఓబుళా పురం గనుల్లో జరిగిన అక్రమాలపై ఏడు సంవత్సరాల జైలు శిక్షకు గురైన కర్ణాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బీజేపీ నుంచి గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన శాసనసభ్యత్వం రద్దయింది
Gali Janardhana Reddy: ఓబుళా పురం గనుల్లో జరిగిన అక్రమాలపై ఏడు సంవత్సరాల జైలు శిక్షకు గురైన కర్ణాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. బీజేపీ నుంచి గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన శాసనసభ్యత్వం రద్దు అయింది. ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె విశాలక్షి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. “హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రధాన ప్రత్యేక కోర్టు, సీసీ నెం.1 ఆఫ్ 2012లో గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక శాసనసభ సభ్యుడు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించినందున, ఆయన దోషిగా తేలిన తేదీ అనగా 2025 మే 6 నుంచి కర్ణాటక శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడమైనది” అని పేర్కొన్నారు.
కాగా ఓబులా పురం గనుల విషయంలో ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో ఇటీవలే ఆయనకు కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ గనుల విషయంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు గాలిని దోషిగా ప్రకటిస్తూ ఏడేళ్ల శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8 ప్రకారం నేరం చేసిన వారికి పదవిలో కొనసాగే అవకాశం లేదు. కాగా ఆయన సభ్యత్వం రద్దయినందున ఈ నెల 6 నుంచి ఆరేళ్లపాటు ఆయనపై అనర్హత అమల్లో ఉంటుంది.
Also read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





