SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime: భార్యభర్త.. మధ్యలో ఓ ట్రాన్స్ జెండర్.. ఆ పని చేయొద్దన్నందుకు నరికేశాడు!


ఏపీ మంగళగిరిలో ఘోరం జరిగింది. ట్రాన్స్‌జెండర్ నర్మదతో దీపక్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నర్మద ఫ్రెండ్ కోటేశ్వరరావు, దీపక్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరువు పోయినట్లు భావించిన దీపక్.. కోటేశ్వరరావును మర్డర్ చేయించాడు.

AP Crime: ఏపీలో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను భార్య మందలించినందుకు దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ కు తెలియడంతో పరువు పోతుందని భావించిన భర్త గుర్తు తెలియని వ్యక్తులతో మర్డర్ చేయించాడు. ఈ అమానుష ఘటన గుంటూర్ జిల్లాలో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.


డ్యాన్స్ ప్రొగ్రామ్ లో పరిచయం..
మంగళగిరి మండలానికి చెందిన కాశీనా ఈశ్వరరావు (కోటేశ్వరరావు) అనే వ్యక్తి  ఓ ప్రైవేట్ సంస్థలో HIV పేషెంట్లకు మందులు ఇప్పించే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రఫీ అలియాస్ నర్మదా అనే ట్రాంజెండర్ తో పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల ఓ డ్యాన్స్ ప్రొగ్రామ్ లో తెనాలి మార్సిన్ పేటకు చెందిన అన్నపురెడ్డి దీపక్ అనే వ్యక్తికి నర్మదతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం గమనించిన దీపక్ భార్య కోటేశ్వరరావుతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసులు ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటినుంచి పరువు పోయినట్లు రగిలిపోతున్న దీపక్.. తమను కోటేశ్వరరావు దూరం చేస్తాడనే అనుమానంతో అతన్ని హత్య చేయించాడు. మంగళగిరి పెదవడ్లపూడి గ్రామ శివారులో బుధవారం రాత్రి నవులూరు గ్రామానికి చెందిన కాశీనా ఈశ్వరరావు (కోటేశ్వరరావు)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి చంపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు.. నర్మదను అదుపులోకి తీసుకుని పరారిలోవున్న నిందితుడు దీపక్ కోసం గాలిస్తున్నారు.

Also read

Related posts

Share this