SGSTV NEWS
CrimeTelangana

Telangana: ఏం తెలివిరా నీది.. అధునాతన టెక్నాలజీతో నకిలీ కార్డ్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్‌ సితార్!

టెక్నాలజీని కొంతమంది వ్యక్తులు మంచి కంటే,ఎక్కువ చెడు కోసమే వినియోగించు కుంటున్నారు. వీరు చేసే అతి తెలివి పనుల వల్ల ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు కేటుగాళ్లు అధుతాన టెక్నాలజీని వాడి ఫేక్‌ ఏటీఎం కార్డ్స్‌ తయారు చేసి ఇతరుల డబ్బులను కాజేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే దుబ్బాక పట్టణంలో వెలుగు చూసింది. కంప్యూటర్ టెక్నాలజీ సహాయంతో నకిలీ ఆర్సి, ఆధార్, పాన్ కార్డులను తయారు చేస్తున్న కంప్యూటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక పట్టణానికి చెందిన సిరిమల్లె వేణుగోపాల్ అనే వ్యక్తి స్థానికంగా బాలాజీ జిరాక్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అయితే ఈ వేణుగోపాల్‌ సులభంగా డబ్బులు సంపాధించేందుకు మార్గాలు అన్వేషించాడు. దీంతో తన షాప్‌కు వచ్చే కస్టమర్ల పాన్‌ కార్డు, బైక్‌ ఆర్సీ వంటి వాటి జిరాక్స్‌లు సేకరించి. వాటి సాహాయంతో నకిలీ కార్డులు తయారు చేయడం స్టార్ట్ చేశాడు.

వేణుగోపాల్‌ నకిలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్డులను .. ఒరిజినల్ కార్డులుగా తయారు చేసి.. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నాడన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్, దుబ్బాక పోలీసులు శనివారం అతని దుకాణంపై దాడి చేశారు. దుకాణంలో ఉన్న వివిధ నకిలీ కార్డులను, కంప్యూటర్, కలర్ ప్రింటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాల్‌ను దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుబ్బాక ఏఎస్ఐ సందాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరిమల్లె వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

Also read

Related posts

Share this