SGSTV NEWS
Andhra PradeshCrime

అయ్యో ఆటో ఆపండి అయ్యా.. అక్కడ ఉన్నది నా కొడుకు బండి అయ్యా..!

అయ్యో ఆటో ఆపండి అయ్యా.. ఆక్కడ చనిపోయింది నా కొడుకు అయ్యా.. ఆ బండి నా కొడుకుది.. ఆ అంగి నా కొడుకుది అయ్యా.. అక్కడ నా కొడుకే పడిపోయినట్టున్నాడు.. ఆటో ఆపండి అయ్యా..అంటు ఆ తల్లి ఆటో ఆపి పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుకును చూసి భోరుమన్నది. వారం రోజుల్లో పెళ్లి కావల్సి కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరు అయింది.

సోమవారం(ఏప్రిల్ 22) కర్నూలు జిల్లా పాములపాడు మండలం కంబాలపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర మృతి చెందాడు. తన పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి వస్తూ.. ప్రమాదవశాత్తు బస్సును ఓవర్టేక్ చేయడం పోయి, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాద సంఘటన జరిగిన ఐదు నిమిషాలలోపే వెనకాల ఆటోలో తల్లి వ్యాపార నిమిత్తం వెళ్లి వస్తూ, ఆ రోడ్డు సైడ్ కొడుకు పడి ఉండడాన్ని గమనించింది. అయ్యో.. ఆటో ఆపండి.. అక్కడ నా కొడుకు లాగే ఉన్నాడంటూ ఆటో ఆపి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూడగా తన కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పెళ్లి పత్రికలు పంచి వస్తాను.. సాయంత్రం పెళ్లి బట్టలకు పోదామని, తిరిగి రాని లోకాలకు వెళ్లిన కొడుకు చూసి ఆ తల్లి రోదనలు అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది.

ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగసుబ్బమ్మ, కాంతారావు దంపతుల రెండవ కుమారుడైన నాగేంద్ర స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన యువతితో నాగేంద్రకు వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 30వ తేదీన ఆత్మకూరు పట్టణంలో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే పాములపాడు మండల కంబాలపల్లె గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్ళికొడుకు నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనం బైక్ డీ కొట్టడంతో, బైక్‌పై ప్రయాణం చేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగేంద్ర మృతి చెందాడు. మృతుడు నాగేంద్ర తన పెళ్లి పత్రికలను పంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో లబోదిపొమ్మంటున్నారు కుటుంబ సభ్యులు

Also read

Related posts

Share this