పెళ్లి చేసుకోడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆర్ఎకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన అన్నాచెల్లెళ్లు చుక్కలు చూపించారు.
భోపాల్: పెళ్లి చేసుకోడానికి మంచి అమ్మాయి కోసం మ్యాట్రిమోనీని ఆశ్రయించిన తెలుగు ఎన్ఆరొకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన అన్నాచెల్లెళ్లు చుక్కలు చూపించారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న యువకుడికి 2023లో మ్యాట్రిమోనీ ద్వారా ఇందౌర్ యువతి బర్ఖా జైస్వానీతో పరిచయమైంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఈమె విడతలవారీగా యువకుడి నుంచి రూ.2.68 కోట్లు వివిధ ఖాతాల్లో బదిలీ చేయించుకుంది.
ఇటీవల ఉన్నట్టుండి వీడియో కాల్ చేసిన ఆ యువకుడికి మాట్లాడిన అమ్మాయి మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో ఉన్నట్టు లేకపోవడంతో అనుమానం వచ్చింది. డబ్బు గురించి అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో బాధితుడు అమెరికా నుంచి నేరుగా ఇందౌర్కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. బర్ఖా అసలు పేరు సిమ్రన్ అని, వివాహిత అయిన ఆమె మ్యాట్రిమోనీ ప్రొఫైలులో ఓ మోడల్ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్తో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరినీ అరెస్టు చేశారు.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





