తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. తండ్రి-కూతుళ్లు ఫ్రెండ్స్ మాదిరిగా బాండింగ్ ఉంటుంది. తన కూతురు తనకు తెలియకుండా చేసిన ఓ పనికి ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..?
నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య – సత్యమ్మ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ గట్టయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుతూ కూతురిని బిటెక్ సెకండియర్ చదివిస్తున్నాడు. తన గారాల పట్టి కూతురును బాగా చదివించి పెళ్లి చేయాలని గట్టయ్య భావించాడు. గత నెల మార్చి 8వ తేదీన ఇంటి నుండి వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదు. కూతురు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందాడు. తండ్రి గట్టయ్య చిట్యాల పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన మూడు రోజులకు యువతి నల్లగొండలోనే ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. చిట్యాలకు చెందిన దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. తన కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ యువతి కోరింది. పోలీసుల నుండి విషయం తెలుసుకున్న గట్టయ్య.. తన కూతురితో ఒకసారి మాట్లాడించాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు. తల్లిదండ్రులను కలవనని యువతీ స్టేట్‌మెంట్ ఇచ్చిందని.. గట్టయ్యకు స్థానిక పోలీసులు చెప్పారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గట్టయ్య ఏప్రిల్ 10వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన ఇరుగు పొరుగు ఆసుపత్రికి తరలించారు. అయితే గట్టయ్య చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచాడు. గట్టయ్య ఆత్మహత్య విషయాన్ని అతడి కుమార్తెకు ఫోన్‌లో చెప్పి చివరిచూపు కోసం రావాలని బంధువులు కోరారు. తాను రానని యువతి తెగేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు
Also Read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





