వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాజీపేట ఎస్సై లవన్ కుమార్ కథనం ప్రకారం..
కాజీపేట టౌన్, న్యూస్టుడే: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాజీపేట ఎస్సై లవన్కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరం కొత్తపేటకు చెందిన గోపాల్ కుమారుడు హృతిక్ సాయి (22) వరంగల్ నిట్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి బుధవారం నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు క్యాంపస్ సిబ్బంది, మిత్రులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాజీపేట శివారు వడ్డేపల్లి చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తిగానే పరిగణించిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం, ఇతర వివరాలు పోస్టు చేయడంతో తోటి విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘హృతిక్సాయి కొంతకాలంగా కళాశాల, హాస్టల్లో ముభావంగా ఉంటున్నాడని, తోటి విద్యార్థులతోనూ సరిగా మాట్లాడేవాడు కాదని, మార్కులు తక్కువగా రావడంతో
మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని’ పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Also Read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





