మాయ మాటలు నమ్మి మోసపోవడం అనేది చాలా మందికి అలవాటుగా మారింది. ఎలాంటి కష్టం లేకుండా.. షాట్‌కట్‌లో ఈజీగా డబ్బు వస్తుందంటే చాలు.. చాలా మంది ఏది చెప్పినా వింటారు.. ఏది చేయమన్నా చేస్తారు.. చివరికి మోసపోయాం.. అని తెలుసుకొని లబోదిబోమంటారు.. సరిగ్గా ఇలాంటి వారినే ఎంచుకుని.. వారిని నమ్మించి బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు.. ఎవరు.. ఎవరు ఏం చెప్పినా వినొద్దు.. మాయమాటలను అస్సలు నమ్మవద్దు అని పోలీసులు పదే పదే చెబుతున్నా.. ఇంకా చాలామంది తీరులో మార్పు రావడం లేదు.. అలానే కేటుగాళ్లు.. అమాయకత్వం.. అత్యాశను ఆసరాగా చేసుకుంటూ దోచుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన వ్యక్తిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు.
టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని మహాశక్తి నగర్ వినాయక జ్యువెలర్స్ కు చెందిన చేపూరి రవికుమార్.. సిద్దిపేటకు చెందిన అంబాడిపల్లి భాస్కర్ కు తక్కువ ధరకు బంగారం ఇస్తానని చెప్పి రూ.9 లక్షలు తీసుకుని మోసం చేశాడు.. దీంతో బాధితుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని సీఐ ఉపేందర్, సిబ్బందితో కలిసి మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు.
తక్కువ రేటుకే బంగారం ఇస్తానని నమ్మించి చాలా మంది నుంచి సుమారు రూ.80 నుంచి 90 లక్షల వరకు తీసుకుని మోసగించినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..