డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తిలో జరిగింది. ఓ మహిళకు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విఫలం కావడంతో పసికందును రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు.
ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ప్రాణాలను కాపాడేందుకు చివరకు పసికందు తల, మొండెంను వేరు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీకి నెలలు నిండాయి
ప్రసవం చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి..
ఈ క్రమంలో ఆమెను అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ నర్సు డెలివరీ చేయడానికి ప్రయత్నించగా విఫలమైంది. దీంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రసవం చేస్తుండగా.. పిండం వెనుక భాగం బయటకు వచ్చింది
దీంతో డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేట్ వైద్యులు పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు సరిగ్గా పనిచేస్తే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





