SGSTV NEWS
CrimeTelangana

Manchu war: మా అన్న పెద్ద దొంగ.. విష్ణుపై నార్సింగి పీఎస్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు!


మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు చెలరేగాయి. మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్‌పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు

Manchu Family Fight: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.  అయితే తాజాగా మరోసారి మంచు బ్రదర్స్  విభేదాలు రచ్చకెక్కాయి. మనోజ్ అన్న విష్ణు పై దొంగతనం కేసు పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  విష్ణు అనుచరులు తన కారుతో కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్‌పల్లిలోని తన నివాసంలో 150 మందితో విధ్వంసం సృష్టించారని, విలువైన వస్తువులను దొంగలించారని తెలిపారు.

ముదురుతున్న వివాదం
ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ లో మొదలైన మంచు ఫ్యామిలీ వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప.. ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలోని  మోహన్ బాబు  ఫామ్ హౌస్ ఆస్తుల విషయంలో మనోజ్, విష్ణు వివాదం మొదలైంది. నాలుగు గోడల మధ్య చిన్నగా మొదలైన ఈ వివాదం చివరికి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది.  తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణుతో మనోజ్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతానికి జల్ పల్లి ఆస్తుల వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Also read

Related posts