ఏపీ అనంతపురంలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. కోర్టు రోడ్డులో ఓ బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తున్న గణేశ్, శ్రీధర్, నూర్ మహ్మద్ ముగ్గురు యువకులు మద్యం మత్తులో గొడవపెట్టుకున్నారు. గణేశ్, శ్రీధర్ కలిసి నూర్‌ను కొట్టి చంపారు.
Murder: ఏపీలో మరో దారుణ మర్డర్ జరిగింది. మద్యం మత్తులో గొడవపడిన యువకులు ఆవేశంలో తన స్నేహితుడి ప్రాణం తీశారు. బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు కలిసి అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఈఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకోగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముగ్గురు కలిసి మద్యం సేవించి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఓ బిర్యానీ సెంటర్ ఉంది. ఇందులో గణేశ్, శ్రీధర్, నూర్ మహ్మద్ అనే ముగ్గురు యువకులు గత కొంతకాలంగా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలోనే పలు విషయాల గురించి చర్చించుకున్నారు. అయితే అనుకోకుండా పని విషయంలో మాటామాట పెరగడంతో గొడవ పడ్డారు. ఆవేశంలో నూర్ మహ్మద్ ను కొట్టి, బలంగా నెట్టేశారు. నూర్ తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే సృహతప్పి పడిపోయాడు
అయితే ఈ విషయాన్ని గమనించి తోటి కార్మికులు.. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నూర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గణేశ్, శ్రీధర్‌కు గాయాలవగా చికిత్స అందిస్తున్నారు. ఈ గొడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స అనంతరం నిందితులను రిమాండ్ కు తరలిస్తామన్నారు.
Also read
- షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
- భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి.. పార్టీ ఇచ్చాడు!
- చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య
- విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
- నరక యాతన పడి వ్యాన్ డ్రైవర్ మృతి