పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం దూలకేశ్వర స్వామి ఆలయం దగ్గర ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పూజారి పూజలో నిమగ్నమైన క్రమంలో.. పెద్ద పెద్ద శబ్దాలతో పాము బుసలు కొట్టడం వినిపించింది. వెంటనే భయంతో పూజారి పాము ఎక్కడ ఉంది? ఎక్కడినుండి శబ్దాలు వినిపిస్తున్నాయి..? అని ఆలయమంతా కలియతిరిగి చూశాడు. అలా చూసే క్రమంలో ఆలయం బయట పార్క్ చేసి ఉన్న తన మోటార్ సైకిల్ వైపు అతని చూపు పడింది. అంతే అక్కడ బైక్ లో నుండి వస్తున్న పాము బుసల శబ్దం విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన మోటార్ సైకిల్ సీటు క్రింద భాగంలో పాము బుసలు కొడుతూ కనిపించింది. అది చూసిన పూజారి కొంతసేపు భయంతో వణికిపోయాడు. చూడకుండా బైక్ ఎక్కి ఉంటే తన ప్రాణాలు పోయి ఉండేవని భయపడ్డాడు. వెంటనే కేకలు వేయటంతో స్థానికులు బైక్ వద్దకు చేరుకున్నారు
అయితే మోటార్ సైకిల్ సీటు కింద ఉన్న బుసలు కొడుతున్న పామును ఎలా బయటికి పంపాలని కలవరం మొదలైంది. మైదాన ప్రాంతంలో పాము కనిపిస్తే ఆ పామును బంధించటం కొంతవరకు తేలిగ్గా ఉంటుంది. కానీ మోటార్ సైకిల్ సీట్ కింద ఉన్న పామును ఎలా బయటకు తీసుకురావాలి.? అని సందేహపడ్డాడు.. ఈ క్రమంలోనే ఒక స్థానికుడు కొంత ధైర్యం చేసి బైక్ కి ఉన్న సీటుని మెల్లగా తొలగించాడు. ఆ తర్వాత పాము బుసలు కొడుతూ పడగ విప్పింది.. సుమారు ఐదు అడుగుల పొడవుతో నల్లగా భయానకంగా కనిపించింది.
వీడియో చూడండి.
అలా పామును చూసే సరికి దానిని బయటకు పంపే సాహసం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.. అప్పటికే బైక్ చుట్టూ స్థానికులు గుమ్మికూడారు. అక్కడ చేరిన వారితో ఆ ప్రాంతమంతా హడావుడిగా మారింది. ఎట్టకేలకు ఒక స్థానికుడు సాహసం చేసి పామును కర్రతో బయటికి దించాడు.. అనంతరం అక్కడి నుండి పాముకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా పక్కనే ఉన్న పొదల్లోకి పంపించారు. ఇదంతా చూసిన పూజారి తన బైక్ లోకి పాము ఎప్పుడు వచ్చింది? బైక్ సీటులోకి ఎలా ప్రవేశించింది? పాము ఉండగానే బైక్ డ్రైవ్ చేశానా? లేక తర్వాత వచ్చిందా? అని కంగారు పడ్డాడు.. అయితే.. శివాలయంలో నిత్యం నాగుపాముకు పూజలు చేసే పూజారి బైక్ లోనే ఇది ప్రత్యక్షమవ్వడం.. మిరాకిల్ అంటూ స్థానికులు చర్చించుకున్నారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది
Also read
- ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం.. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో విషం!
- మహిళ ముందు ప్యాంటు జిప్ తీసి.. ప్రైవేట్ పార్ట్‌ను చూపిస్తూ.. ! అడ్డొచ్చిన సొంత తల్లిపై..
- ఒకే ఊరిలో ముగ్గురు మైనర్లకు పెళ్లి..! అధికారులు ఎంట్రీ ఇచ్చేసరికే..
- దుర్గగుడికి వెళ్లి వచ్చేసరికి ఊహించని షాక్.. కారులో పెట్టిన నగలు మాయం..
- ఇదేందయ్యా ఇది.. రోడ్డు ఇలా కూడా వేస్తారా.! అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్